2024 నాటికి వారిని తరిమి కొడతామన్న అమిత్‌ షా

మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు ఉండటం లేదని, అందుకే వారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.

మోడీ ప్రభుత్వం చేసిన ట్రిపుల్‌ తాలక్‌ రద్దు చట్టం మరియు 370 ఆర్టికల్‌ను రద్దు చేయడంతో దేశ స్థితిగతులు మారుతాయని ఆయన అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో ఉన్న వలసదారులందరిని కూడా తరిమి కొడతామంటూ హెచ్చరించారు.పీఓకేలో ఉన్న వారి గురించి అమిత్‌ షా ఇండైరెక్ట్‌గా కౌంటర్‌ వేశాడు.

వచ్చే ఎన్నికల నాటికి పీఓకేలో ఇండియా జెండా పాతుతామంటూ అమిత్‌షా గతంలో కూడా ప్రకటించిన విషయం తెల్సిందే.ఈసారి మరింత సీరియస్‌గా వలసదారులను కనిపించకుండా పాలద్రోలుతాం అంటూ హెచ్చరించిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

దేశంలో పలు సమస్యలకు మోడీ ప్రభుత్వం మాత్రమే పరిష్కారం చూపించగలదని ఆయన అన్నారు.తాజాగా హర్యానా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు