భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్ ..!!

భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్( American singer Mary Millben ).తొలి నుంచి ఈమెకు భారతదేశమంటే ఎంతో ఇష్టం.

ఈ క్రమంలోనే దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ డే విషెస్ తెలియజేశారు.స్వాతంత్ర్య స్పూర్తి కేవలం జ్ఞాపకం కాదని.

ముందుకు నడిపించే జ్యోతి అని మిల్‌బెన్ పేర్కొన్నారు.భిన్న సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలతో రూపుదిద్దుకున్న దేశం ఇండియా అని.పూర్వీకుల త్యాగాలను గుర్తుంచుకుంటూ స్వేచ్ఛ, పురోగమనంలో నడవాలని మిల్‌బెన్ ఆకాంక్షించారు.

ఇదే సమయంలో భారత త్రివర్ణ పతాకంలో వున్న మూడు రంగుల అర్ధాన్ని కూడా ఆమె వివరించారు.

కుంకుమ రంగు ధైర్యాన్ని, త్యాగాన్ని… తెలుపు రంగు శాంతి, సత్యాన్ని… ఆకుపచ్చ అభివృద్ధిని, సమృద్ధిని సూచిస్తుందని మిల్‌బెన్ పేర్కొన్నారు.దేశ భవితవ్యం మీ చేతుల్లోనే వుందని గుర్తుచేస్తూ ప్రగతి చిహ్నమైన చక్రాన్ని మరచిపోకూడదన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) వంటి దూరదృష్టి గల నాయకుల నుంచి ప్రేరణ పొందాలని భారతీయులకు మిల్‌బెన్ సూచించారు.అచంచలమైన సంకల్పంతో భవిష్యత్తులోకి వెళ్లాలని ఆకాంక్షిస్తూ.

జై హింద్, జై ఇండియా అంటూ మేరి మిల్‌బెన్ ముగించారు.

Telugu Americanmary, Ronaldreagan-Telugu NRI

ఎవరీ మిల్‌బెన్ :

ఓక్లహోమా నగరంలోని క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించారు.తల్లి అల్ధియా మిల్‌బెన్ పెంటెకోస్తల్ మ్యూజిక్ పాస్టర్‌గా పనిచేసింది.ఈ క్రమంలోనే మ్యూజిక్ మిల్‌బెన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఈ నేపథ్యంలో ఓక్లహోమా సిటీలోని వైల్డ్‌వుడ్ క్రిస్టియన్ చర్చిలో( Wildwood Christian Church ) చిన్నారుల గాయక బృందంలో ఐదేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది.భారత ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆహ్వానం మేరకు మిల్‌బెన్ గతేడాది భారతదేశాన్ని సందర్శించారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మిల్‌బెన్ ప్రదర్శన ఇచ్చారు.

Telugu Americanmary, Ronaldreagan-Telugu NRI

మిల్‌బెన్ గతంలో భారత జాతీయ గీతం జనగణమన, ఓం జై జగదీష హరే పాటలను పాడి భారతీయులకు దగ్గరయ్యారు.ఆమెకు తొలి నుంచి భారతదేశమన్నా, ఇక్కడి సాంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం.ఈ ఏడాది జూన్‌ 23న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (యూఎస్‌ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు.

ఈ సందర్భంగా మోడీ పాదాలకు మిల్‌బెన్ నమస్కరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube