సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కుల వృత్తులకు బీసీ బంధు( BC Bandhu ) పథకం సూర్యాపేట జిల్లాలో పక్కదారి పట్టిందని అధికార పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఘటనలు గులాబీ క్యాడర్ లో గుబులు పుట్టిస్తోంది.తాము సూచించిన వారికి ఇవ్వకుండా మండల పార్టీ అధ్యక్షుడు,ఎంపిపిలు ఇష్టానుసారంగా ఇచ్చారని జిల్లాలో ఓ ఎంపిటిసి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీనిని బట్టి బీసీ బంధు మొత్తం బీఆర్ఎస్( BRS party ) నాయకులకే కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి.జిల్లాల్లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కోదాడ నుండే ప్రారంభించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల లబ్ధిదారులు 294 మందికి 2.94కోట్ల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడిన మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 300 మందికి లక్ష రూపాయాల చొప్పున సహాయం అందజేస్తామని,జిల్లాలో ఈ పథకం అమలును కోదాడ నుంచే ప్రారంభించామన్నారు.
కోదాడ చెక్కుల పంపిణీ నుండే కారు పార్టీలో కలవరం మొదలైందని టాక్.ఇప్పటి వరకు అందించిన బీసీ ఆర్ధిక సహాయం చెక్కులు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే రావడం, అది కూడా ఒక్కో గ్రామానికి రెండు,మూడే రావడం,దరఖాస్తు చేసుకున్న అసలైన అర్హులు,అర్హులైన గులాబీ క్యాడర్ బడా నేతల తీరుపై గుర్రుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీసీల్లో ఏ ఆధారం లేకుండా కేవలం రెక్కల కష్టం మీద బ్రతికే పేదలను విస్మరించి పార్టీ నాయకులకు ఆర్ధిక సహాయం అందివ్వడంపై జిల్లాలోని బీసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బీసీ బంధులోచెక్కులు అందుకున్న వారంతా బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులు కావడంతో గ్రామస్థాయి నుండి జిల్లా వరకు ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ అర్హులైన పేదలకు ఆర్ధిక సహాయం అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదెవరు? అసలు బీసీ బంధు ఎంపిక ప్రక్రియ ఎవరి చేతిలో ఉంది?దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎలా గుర్తించారు? నాయకత్వ స్థానంలో ఉన్న వారికే ఎలా వచ్చాయి?అనే ప్రశ్నలు బీసీ ప్రజల్లో ఆలోచన రేకెత్తుతున్నాయి.పథకం బీసీల కోసం పంచుకున్నది బీఆర్ఎస్ నాయకులని బీసీ సంఘం నాయకులు.
మాధవశెట్టి మహేష్ ఆరోపించారు.కులవృత్తులతో జీవించే బీసీలకు ఆర్ధిక సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం బీసీ బంధు తెస్తే అర్హులైన వారిని పక్కన పెట్టి,అనర్హులకు,పార్టీ నాయకులకు ఇస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే బీసీలా? లేకుంటే బీసీలు కదా?ప్రభుత్వ పథకం పార్టీ నాయకులకు ఇవ్వడం ఏమిటి?ప్రభుత్వ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ బీసీకి పంపిణీ అందేలా చూడాలన్నారు.







