పెళ్లి బంధం తో ఒక్కటైన అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి

విజయ శాంతి హీరోయిన్ గా నటించిన పడమటి సంధ్యారాగం చిత్రం గుర్తు ఉండే ఉంటుంది.

ఆ చిత్రంలో అమెరికా అబ్బాయి,తెలుగు యువతి అయిన విజయ శాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

ఇప్పుడు ఈ కధ అంతా ఎందుకు అని అనుకుంటున్నారా.ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమచిగురించింది అంటే కులమతాలు,ప్రాంతాలు,దేశాలతో సంబంధం లేకుండా వారు తమ ప్రేమను పొందాలని అనుకుంటారు.

సరిగ్గా ఇదే జరిగింది చిత్తూరు జిల్లా లో.అమెరికా కు చెందిన అబ్బాయి కి చిత్తూరు కు చెందిన అమ్మాయిని ఇష్టపడి భారత్ కు వచ్చి మరీ ఆ యువతిని వివాహమాడాడు.ఈ ఘటన చిత్తూరు లో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.చిత్తూరు కొంగారెడ్డిపల్లెలోని ఉషానగర్ కు చెందిన ఎల్.బి.సుధాకర్ నాయుడు కుమార్తె శ్రీనిషా 2013లో అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లింది.అయితే అదే యూనివర్సిటీ లో చదువుతున్న అమెరికాకు చెందిన ఆండ్రూ గార్ణియర్ తో పరిచయం ఏర్పడింది.

Advertisement

అయితే వారిద్దరి కోర్సు పూర్తయిన తరువాత అదే యూనివర్శిటీలో మొదట శ్రీనిషాకు, ఆ తరువాత ఆండ్రూకు ఉద్యోగాలు వచ్చాయి.ఇద్దరూ అక్కడే పని చేస్తున్నారు.ఆ తరువాత ఆండ్రూ శ్రీనిషాను ఇష్టపడడం తో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన రాధ అనే అమ్మాయికి విషయం చెప్పాడు.

దీనితో అదే యూనివర్సిటీ లో మేనేజర్ గా పనిచేస్తున్న రాధ శ్రీనిషా తో విషయం తెలపడం తో తమ కుటుంబ సభ్యులు,బంధువుల తో మాట్లాడి చెబుతాను అని తెలిపింది.దీనితో అనంతరం తన కుటుంబ సభ్యుల తో మాట్లాడిన తరువాత వారు కూడా సమ్మతించడం తో శ్రీనిషా తల్లి దండ్రులు అమెరికాకు వెళ్లి ఆండ్రు తల్లిదండ్రుల తో మాట్లాడి నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నారు.

అనంతరం వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలి అని శ్రీనిషా తల్లిదండ్రులు కోరడం తో వారి కోరిక ప్రకారం ఆండ్రో అంగీకరించి కుటుంబం తో కలిసి చిత్తూరు కు వచ్చాడు.దీనితో గురువారం చిత్తూరులోని హోటల్ ప్రభగ్రాండ్ ఇన్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిగింది.

వివాహానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దొరబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గ, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఎన్పీ రామకృష్ణ, నగర డీఎస్పీ వెంకటరామాంజనేయులు తదితరులు హాజరయ్యారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు