భారతదేశం మొత్తం తిరిగితే చాలు 100 దేశాలు తిరిగినంత అనుభూతి లభిస్తుంది అనడంలో సందేహం లేదు.రకరకాల సంస్కృతులు రకరకాల భాషలు రకరకాల ఆహారాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం భిన్నత్వానికి ఏకత్వంగా నిలుస్తుంది అందుకే ఇక్కడికి వచ్చేవారు అందరూ ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు బాగా తాజాగా ఒక అమెరికన్ ఫుడ్ లాగా మన ఇండియా సంస్కృతికి ఫిదా అయిపోయాడు అనంతరం రొట్టెలను చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఇతడు మన ఇండియన్ సంస్కృతిని బాగా మెచ్చడం కూడా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.ప్రముఖ అమెరికన్ బ్లాగర్, చెఫ్ ఈటాన్ బెర్నాథ్ గత కొద్ది రోజులుగా ఇండియాలో తిరుగుతూ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు.కుటుంబంతో కలిసి ఇండియాలో దిగిన ఈ బ్లాగర్ ఇప్పటికే గోవా, జైపూర్, పట్నా సహా అనేక సిటీలను సందర్శించాడు.ఇప్పుడు ఢిల్లీలో పర్యటిస్తున్నాడు.
అక్కడ ఒక గురుద్వారాను సందర్శించిన ఈ విదేశీయుడు రోటీలు తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఆపై అతను కూడా రోటీలను తయారు చేశాడు.ఆ వీడియోను అమెరికన్ చెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియోలో అమెరికన్ చెఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారాలో ఉండటం చూడవచ్చు.అలానే అతను ట్రెడిషనల్ టవల్ కప్పుకున్నాడు.
ఈ వీడియోలో అతను కమ్యూనిటీ కిచెన్ గురించి ఎక్స్‌ప్లైన్ చేశాడు.
చెఫ్‌లు, రోటీల మేకింగ్ చూపించడంతోపాటు అతడు రోటీలు చేసినట్లు ఈ వీడియోలో వివరించాడు.అలా చేయడం వల్ల తనకు ఎంతో సంతోషం కలిగిందని అతడు వెల్లడించాడు.అలానే వీడియోలో తాను చూపిస్తున్న ఆ రోటీ మెషిన్ ప్రతి గంటకు 4,000 రోటీలను తయారు చేయగలదని పేర్కొన్నారు.
ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.