సాధారణంగా మనకి తెలియని ఏరియాలో కూడా కప్పు కాఫీ తాగాలంటే మనం ఎంత చెల్లిస్తాం? రూ.20 లేదంటే మరీ పాపులర్ కాఫీ అయితే ఓ రూ.50ల వరకు ఉంటుంది, అంతే కదా.ఐతే ఓ రెస్టారెంట్‌లో మాత్రం కప్పు కాఫీ ధర ఏకంగా 3 లక్షల రూపాయిలు. అవును, మీరు విన్నది నిజమే.3 లక్షలంటే ఆ కాఫీని బంగారంతో చేస్తారా? అనే అనుమానం కలగక మానదు.ఇక ఆ కథ తెలియాలంటే ఈ కధనం మొత్తం మీరు చదవాల్సిందే.
మీరు ఊహిస్తున్నట్టు అక్కడ కాఫీలో స్పెషలంటూ ఏమీ లేదు.
వచ్చిన తంటా అంతా ఆ రెస్టారెంట్‌తోనే.అవును, బేసిగ్గా రెస్టారెంట్లకు సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు కాఫీతోపాటు ఇతర స్నాక్స్ కూడా తింటుంటాం.
ఇక్కడ కూడా అదే జరిగింది.కాఫీ విత్ స్నాక్స్‌కు కలిపి సదరు రెస్టారెంట్ ఏకంగా రూ.3,66,915ల బిల్లు వేసి షాక్ ఇచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లు నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఓక్లహోమాలోనున్న స్టార్‌బక్స్ రెస్టారెంట్ గురించే ఇపుడు స్థానికంగా చర్చ నడుస్తోంది.వివరాల్లోకి వెళితే, జెస్సీ, డీడీ ఓ’డెల్ అనే అమెరికా జంటకు గత 16 ఏళ్లుగా ఓ అలవాటు అనేది పరిపాటైంది.అదేమంటే… ప్రతి రోజూ ఉదయం వారు స్టార్‌బక్స్‌కి వెళ్లి రెండు కప్పులు వేడి వేడి కాఫీ తాగుతారు.అందుకు వారు 10 డాలర్లు మాత్రమే చెల్లించేవారు.
ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే గత నెలలో స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లి కాఫీ తాగిన తరువాత సదరు హోటల్ వాళ్ళు ఇచ్చిన బిల్లుకు షాక్ తిన్నారు.
ఇంత బిల్లు ఎందుకేశారని స్టార్‌బక్స్ యాజమన్యాన్ని నిలదీస్తే కాఫీ బిల్లుతోపాటు గ్యాట్యుటీ రుసుము కూడా చెల్లించవల్సిందేనని తాపీగా బదులిచ్చారు.దీంతో అమెరికా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తర్వాత సాంకేతక లోపం కారణంగా సమస్య తలెత్తిందని గ్రహించిన స్టార్‌బక్స్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.