స్టార్ హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.నారా బ్రాహ్మణి సినీ, రాజకీయ రంగాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు వ్యాపారాల ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి విషయానికి వస్తే తారక్ కు తగ్గ భార్యగా ఇండస్ట్రీలో లక్ష్మీ ప్రణతి ప్రశంసలు అందుకున్నారు.పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన లక్ష్మీ ప్రణతి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అయితే ఒకే ఫ్రేమ్ లో నారా బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఫోటోలో బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి మాహాలక్ష్ములలా ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఫోటోను చూస్తే రెండు కళ్లు చాలడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సర్కార్ ఈ కార్ రేసింగ్ లను నిర్వహించగా తెలంగాణ సర్కార్ ఈ రేసింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది.నిన్న ప్రీ ప్రాక్టీస్ రేస్ ను నిర్వహించగా ఈ ఈవెంట్ లో బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి సందడి చేసి వార్తల్లో నిలిచారు.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి సినిమాలకు దూరంగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ భార్య నమ్రత కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశారు.
హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేసింగ్ ను నిర్వహించడం గ్రేట్ అని ఆమె కామెంట్ చేశారు.నాకు రేసింగ్ అంటే ఇష్టం ఉండదని అయితే తన కొడుకు గౌతమ్ కు ఇష్టం కావడంతో ఈ ఈవెంట్ లో పాల్గొన్నానని ఆమె తెలిపారు.