ఊహించని మలుపు..విజయానికి చేరువలో బిడెన్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది.ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు అనే ఉత్కంటకు తెరపడే సమయం ఆసన్నమయ్యింది.

అత్యధికంగా ఓట్లను సొంతం చేసుకున్న బిడెన్ దాదాపు మెజారిటీ రాష్ట్రాలలో గెలుపు బావుటా ఎగరేశారు.ఎవరూ ఊహించని విధంగా కేవలం 6 ఓట్ల దూరంలో విజయానికి చేరువ అవడానికి సిద్దంగా ఉన్నారు.

ఇక గెలుపు డెమోక్రటిక్ పార్టీదే నని దాదాపు ఖరారై పోయిందని అంటున్నా ఒక వేళ బిడెన్ గెలిస్తే ట్రంప్ కోర్టుకు ఎక్కుతారనే వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులలో ఒకింత ఆందోళను రేకెత్తిస్తోంది.ఇదిలాఉంటే ఇప్పటివరకూ అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగగా 45 రాష్ట్రాల ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి.

మరో ఐదు రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, అలస్కా రాష్ట్రాలలో ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదు.అయితే ఈ రాష్ట్రాలలో కేవలం నెవాడాలో మాత్రమే బిడెన్ కి పట్టుఉంది.

Advertisement

మిగిలిన రాష్ట్రాలలో ట్రంప్ హవానే నడుస్తోందని తెలుస్తోంది.ఓట్ల లెక్కింపు లో కానీ, కొన్ని ప్రాంతాలలో జరిగిన పోలింగ్ సరళిలో తనకి అనుమానాలు ఉన్నాయని ట్రంప్ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.

ట్రంప్ ఈ ప్రకటన చేయగానే ఆయన మద్దతు దారులు విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను మళ్ళీ లేక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదే రాష్ట్రంలో గత ఎన్నికల్లో ట్రంప్ కేవలం ఒకేఒక్క పాయింట్ ఓటుతో ఓడిపోయాడు.కానీ ఈ సారి తమకు ఈ రాష్ట్రంలో ప్రజల మద్దతు భారీగా ఉందని మళ్ళీ ఓట్లను లెక్కించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

కౌంటింగ్ జరుగుతున్న సమయంలో శ్వేత సౌధం బిడెన్, ట్రంప్ మద్దతు దారుల మధ్య ఘర్షణ వాతావరం నెలకొంది.అయితే ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఒక వేళ గెలుపు ఓటములు తేలిన తరువాత మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు