తండ్రి జ్ఞాపకార్ధం... భద్రాద్రి రామయ్యకు ఎన్ఆర్ఐ భారీ విరాళం

దేశం కానీ దేశంలో స్థిరపడినా కొందరు ఎన్ఆర్ఐలు మాతృదేశంపైనా, ఇక్కడి ఆచార వ్యవహరాలు, సాంప్రదాయాలపైనా ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు.

ఏదో రకంగా సాయం చేస్తూ పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటున్నారు.

తాజాగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ.ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు.పాల్వంచకు చెందిన ఐకా రవి అనే ప్రవాస భారతీయుడు తన తండ్రి జ్ఞాపకార్ధం ఆలయం నిర్వహిస్తున్న శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.38 లక్షలు విరాళంగా అందజేశారు.ఈ నగదును ఆయన ఆన్‌లైన్ ద్వారా భద్రాద్రి ఆలయ ఖాతాలో జమ చేశారు.

ఇందుకు సంబంధించిన బాండ్‌ను ఐకా రవి కుటుంబానికి స్నేహితుడు రాజుకు దేవస్థానం ఈవో అందజేశారు.ఈ సందర్భంగా దేవస్థాన పూజారులు మాట్లాడుతూ.ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకునే భక్తులు టీయాప్ ఫోలియా , మీ సేవా ద్వారా పేర్లు నమోదు చేసుకుని పూజలు చేయించుకోవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్ ద్వారా పూజలు చేయించుకుంటున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని పేర్కొన్నారు.లాక్‌డౌన్ సమయంలో కొద్దిరోజులు భద్రాద్రి ఆలయంలో అన్నదానం నిలిపివేసినప్పటికీ ఆ తర్వాత నిత్యం 400 వరకు భోజనం పొట్లాలను పేదలకు, భక్తులకు అందజేయనున్నారు.

Advertisement
పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??

తాజా వార్తలు