అమీర్ ఖాన్ బాల్యంలో ఇన్ని కష్టాలున్నాయా.. అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు.

 Ameer Khan Emotional Comments About His Life Struggles Details, Amir Khan,bollyw-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఈనెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమీర్ ఖాన్ సినిమా గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ తన బాల్యంలో తాను అనుభవించిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.హ్యూమన్ ఆఫ్ బాంబే అని ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన చిన్నప్పటి విషయాలను అందరితో పంచుకున్నారు.

తాను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని అప్పట్లో అధికంగా అప్పులు కూడా చేశారని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నడుమ మా చదువులు కూడా ఎంతో ఇబ్బందికరంగానే కొనసాగాయని తెలిపారు.

Telugu Ameer Khan, Ameerkhan, Amir Khan, Bollywood, Bombay, Naga Chaitanya-Movie

తన అక్క అన్నయ్య పై తరగతులు చదువుతుండడం వల్ల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో స్కూల్లో ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు.అయినప్పటికీ స్కూల్ ఫీజ్ చెల్లించకపోవడంతో స్కూల్ అసెంబ్లీలో తన అక్కయ్య అన్నయ్య పేర్లను పెద్దగా చదివేవారు.ఇలా స్కూల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, ఇలా అందరి ఎదురుగా ఫీజు కట్టలేదని మన పేర్లు చదవడం ఒక విద్యార్థికి ఎంత అవమానకరంగా ఉంటుందో అని చెబుతూనే ఈయన ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube