జర్మనీలో అద్భుతమైన ట్రైన్ జర్నీ.. వీడియో చూస్తే ఫిదా..

అడవుల్లో నుంచి వెళ్లే ట్రైన్లలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు అద్భుతమైన ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.అదే మంచు కురిసే ప్రాంతంలో వెళ్లే ట్రైన్ ఎక్కితే అదొక కనుల విందు అవుతుందని చెప్పుకోవచ్చు.

 Amazing Train Journey In Germany. , Viral Video, Latest News, Trending News, Tra-TeluguStop.com

ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి ఈ ప్రపంచంలో చాలానే ట్రైన్ మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా జర్మనీలో, ఇక్కడ మంచు కురిసిన ఒక అడవి గుండా స్టీమ్ ట్రైన్( Steam engine train ) ప్రయాణిస్తుంది.

ఆ మార్గం గుండా చెట్లపై మంచు కురిసే అద్భుతంగా అనిపిస్తుంది.మరీ స్పీడ్ గా కాకుండా కొద్దిగా స్లోగా ఈ ట్రైన్ వెళుతూ ఉంటే బయటికి చూసినప్పుడు ఆ దృశ్యాలు కట్టిపడేస్తాయి.

ఆ అనుభూతి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయింది.7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక స్టీమ్ ఇంజన్ ట్రైన్ పొగలు కక్కుతూ ముందుకు వెళ్లడం మనం గమనించవచ్చు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అద్భుతమైన పాట కూడా వినిపించింది.ఒక ప్యాసింజర్ బోగీ వెలుపల నుంచి దీనిని వీడియో రికార్డ్ చేశారు.

@gunsnrosesgirl3 ట్విట్టర్( Twitter ) పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.“బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ ఇన్ జర్మనీ” అనే క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో చూసి “ఓ మై గాడ్, వావ్, సూపర్, బ్యూటిఫుల్” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే మూడు లక్షల దాక వ్యూస్ పొందిన దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube