నిత్యం ఈ టీ తాగితే నిద్రలేమి, అధిక బరువుతో సహా ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?

రోజు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

అయితే పాలు, పంచదారతో తయారు చేసిన టీ, కాఫీలు(Tea, coffee) ఆరోగ్యానికి అంత మంచివి కావు.

కానీ ఇప్పుడు చెప్ప‌బోయే యాపిల్ మింట్ టీ మాత్రం హెల్త్ పరంగా అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న యాపిల్ (Apple)ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో నాలుగు యాపిల్ స్లైసెస్, ఐదారు క్రష్ చేసిన ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు లెమన్ స్పైసెస్, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక గ్లాస్ వేడి వేడి నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఎనిమిది నిమిషాల పాటు వదిలేయాలి.దాంతో మన యాపిల్ మింట్ టీ(Apple mint tea) అనేది రెడీ అవుతుంది.

నిత్యం ఈ టీ తాగితే చాలా ప్రయోజనాలు పొందుతారు.యాపిల్ మింట్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను(Bad cholesterol) తగ్గించడానికి మరియు రక్తపోటును అదుపులో ఉంచ‌డానికి సహాయపడుతుంది.యాపిల్ మింట్ టీలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.

Advertisement

ఇవి బలమైన ఎముకలను నిర్మించడంలో తోడ్ప‌డ‌తాయి.అలాగే నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం ఈ టీను తాగితే చాలా మేలు జ‌రుగుతుంది.

యాపిల్ మింట్ టీ ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది.గాఢ‌మైన నిద్ర‌ను ప్రోత్స‌హిస్తుంది.

అలాగే అధిక బ‌రువు(over weight) స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని భావిస్తున్న వారు ఈ టీను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోండి.ఎందుకంటే ఇది మీ జీవ‌క్రియ‌ను మెరుగుప‌రిచి బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది.అంతేకాదు రోజుకో క‌ప్పు యాపిల్ మింట్ టీ తాగితే మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.

జీర్ణ‌క్రియ చురుగ్గా సైతం మారుతుంది.

Spicy Food : స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే.. ఈ అనర్థాలు భరించక తప్పదు..!
Advertisement

తాజా వార్తలు