స్ట్రెస్ రిలీఫ్ నుంచి వెయిట్ లాస్ వరకు పైనాపిల్ టీ తాగితే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా..?

చూడడానికి ఆకర్షణీయంగా, తినడానికి రుచికరంగా ఉండే పండ్లలో పైనాపిల్ (pineapple) ఒకటి.ఆరోగ్యపరంగా కూడా పైనాపిల్ మనకు ఎంతో మేలు చేస్తుంది.

అయితే ఇప్పటివరకు పైనాపిల్ ను నేరుగా లేదా జ్యూస్ రూపంలో మాత్రమే తీసుకొని ఉంటారు.కానీ పైనాపిల్ టీ కూడా చాలా బాగుంటుంది.

అలాగే స్ట్రెస్ రిలీఫ్ నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంతకీ పైనాపిల్ టీ(pineapple tea) ని ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే లాభాలు ఏంటి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు పీల్ తొలగించిన పైనాపిల్ స్లైసెస్, హాఫ్‌ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం (ginger)తురుము, ఐదు నుంచి ఆరు పుదీనా (Mint)ఆకులు వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో తయారు చేసుకున్న టీ ని ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ పైనాపిల్ టీ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్(Lemon Juice), వన్ టేబుల్ స్పూన్ తేనె(Honey) వేసి మిక్స్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

పైనాపిల్ టీలో(pineapple tea) అమినో యాసిడ్‌లు ఉంటాయి.ఇవి సెరోటోనిన్‌ని పెంచడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే రోజుకు ఒక కప్పు పైనాపిల్ టీ తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో మీ వెయిట్ లాస్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.పైనాపిల్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్ప‌డుతుంది.రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?

పైనాపిల్ టీలో సహజ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఇవి బాడీని హైడ్రేట్ గా ఉంచుతాయి.పైనాపిల్ టీలోని పొటాషియం ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.పైనాపిల్ టీలో ఉండే విటమిన్ ఎ, విట‌మిన్ సి మరియు బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు వయస్సు సంబంధిత కంటిశుక్లం, దృష్టి సమస్యల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.

Advertisement

తాజా వార్తలు