ఘనంగా నటి అమలాపాల్ సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

డస్కీ బ్యూటీ అమలాపాల్ ( Amalapaul ) త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే.ఈమె గత ఏడాది నవంబర్ నెలలో జగత్ దేశాయ్( Jagath Desai ) అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు.

 Amalapaul Baby Shower Photos Goes Viral, Amalapaul, Jagath Desai, Baby Shower, B-TeluguStop.com

ఈమె మొదట తమిళం దర్శకుడిని వివాహం చేసుకున్నారు.ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయినటువంటి అమలాపాల్ ఒంటరిగా ఉంటూ జగత్ దేశాయ్ అనే వ్యక్తి ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో విహరిస్తూ ఉన్నటువంటి ఈ జంట గత ఏడాదిలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.నవంబర్ నెలలో వివాహం చేసుకున్నటువంటి ఈమె పెళ్లైన కొద్ది రోజులకే తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని అందరికీ షేర్ చేయడమే కాకుండా తరచూ తన బేబీ బంప్ ( Baby Bump ) ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.అయితే మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నటువంటి తరుణంలో ఘనంగా తన సీమంతపు( Baby Shower ) వేడుకలను జరిపారు.తన భర్త జగత్ దేశాయ్ ఇంట్లోనే వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం ఈమె సీమంతపు వేడుకలు జరిగాయి.

తాజాగా అమలాపాల్ తన సోషల్ మీడియా వేదికగా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇటీవల ఈమెకు కవలలు జన్మించబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

మరి నిజంగానే కవలలు జన్మించబోతున్నారా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube