Amala Paul: ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఫొటోస్ వైరల్..!!

కేరళ బ్యూటీ అమలాపాల్ ( Amala Paul ) అంటే ప్రత్యేకపరిచయాలు అక్కర్లేని హీరోయిన్.

ఈమె తన అందచందాలతో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల సినిమాల్లో నటించింది.

ఈమె మలయాళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.అలా తమిళ,తెలుగు,కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు అందుకని ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది.

ఇక తెలుగులో నాయక్,ఇద్దరమ్మాయిలతో ( Iddarammayilatho ) వంటి సినిమాల ద్వారా ఫేమస్ అయింది.అలా ఈమె సినీ కెరియర్ ముందుకు సాగుతున్న తరుణంలో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించింది.

ఇక ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో విజయ్( Director Vijay ) ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

Advertisement

ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ జంట కొద్దిరోజులు కూడా ఉండలేకపోయారు.సినిమాల్లో నటించకూడదని అమలా పాల్ కి కండిషన్ పెట్టారో లేక ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉండచ్చో తెలియదు కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు.అలా వీరిద్దరి మధ్య పెళ్లి బంధం బ్రేక్ అయ్యింది.

ఇక ఆ మధ్యకాలంలో అమలాపాల్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ అది కేవలం ఒక యాడ్ కోసమే అని స్పష్టం చేశారు.

అయితే గత పది రోజుల కిందట అంటే అమలాపాల్ బర్త్ డే అక్టోబర్ 26న ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో అమలాపాల్ కి ప్రపోజ్ చేస్తూ నా లవ్ యాక్సెప్ట్ చేసింది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.ఇక ఆమెతో ఉన్న రొమాంటిక్ ఫోటోలు, రొ**టిక్ వీడియోలు కూడా అందులో షేర్ చేశారు.అయితే లవ్ యాక్సెప్ట్ చేసి పట్టుమని పది రోజులు కాకుండానే ఆ వ్యక్తితో అమలాపాల్ పెళ్లి పీటలు ఎక్కింది.

నిన్న అనగా ఆదివారం నవంబర్ 5న అంగరంగ వైభవంగా అమలాపాల్ ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జగత్ దేశాయ్ (Jagath desai) అనే వ్యక్తిని పెళ్లాడింది.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇక వీరిద్దరూ కేరళ( Kerala )లోని ఓ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.అలాగే అమలాపాల్ పెళ్లి చేసుకున్న జగత్ దేశాయ్ పర్యాటక, అతిథ్య రంగాల నిపుణుడు అని తెలుస్తోంది.ప్రస్తుతం అమలపాల్ రెండో పెళ్లి( Amala Paul Second Marriage ) కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రపోజ్ చేసిన పది రోజులకే పెళ్లి చేసుకున్నారు అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు