Amala Nagarjuna : నాగార్జునకు నాకు కేవలం ఆ ఒక్క విషయంలోనే గొడవలు జరుగుతాయి : అమల

అమల నాగార్జున( Amala Nagarjuna )…. ఈ జంట చాలా ఎళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.

 Amala About Fights With Nagarjuna-TeluguStop.com

చాలా జంటలు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక విడాకుల బాట పడుతున్నారు.కానీ వారందరికి విరుద్ధంగా ఈ జంట ఎంతో ప్రేమతో మెలుగుతూ వస్తున్నారు.

ఇంట గెలిచి బయట గెలవాలి అనే సామెతను ఈ జంట నిజం చేస్తున్నారు కూడా.చాలామంది నాగార్జున( Nagarjuna ) కమర్షియల్ అని, టాలీవుడ్ లోనే ఆస్తిపరుడు అని, అన్ని విషయాలు బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తారు అని చెబుతారు, కానీ ఆయన కుటుంబ విషయం వచ్చే సరికి చాలా జాగ్రత్తగా ఉంటాడు, భార్య కోరికలకు విలువ ఇవ్వడం భర్తగా తన బాధ్యత అనే అనుకుంటాడు.

Telugu Akkineni Amala, Amalafights, Amala Nagarjuna, Fights, Nagarjuna, Tollywoo

అయితే అమల( Amala Akkineni ) ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి మధ్య సాధారణ భార్యాభర్తల్లాగే గొడవలు వస్తాయని తెలిపారు, వారి గొడవలు ఎక్కువగా తను ఏదైనా చేయాలనుకున్న సమయంలో చేయలేకపోతున్నానేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుందట అమల, అందువల్లే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు చేయడానికి ప్రయత్నించు అంటూ నాగార్జున చెప్పడం స్టార్ట్ చేస్తారట, ఈ ఆర్గ్యుమెంట్( Argument ) లోనే వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుందట.ఇక ఏ గొడవ జరిగినా కూడా అది పూర్తిగా సాల్వ్ చేసుకోకుండా నిద్రపోవడానికి ఒప్పుకోరట.

Telugu Akkineni Amala, Amalafights, Amala Nagarjuna, Fights, Nagarjuna, Tollywoo

అది ఎలాంటి గొడవైనా కూడా పడుకునే లోపే ఖచ్చితంగా ఒక పరిష్కారం చూసుకుంటారట.నా భర్త నాకు ఒక మంచి ఫ్రెండ్ అని, అలాగే నా లవ్ ఆఫ్ లైఫ్ అని, మంచి సపోర్ట్ సిస్టం అని, నాగార్జున లేకుండా నా జీవితంలో( Life ) ఏది సవ్యంగా జరగదు అంటూ అమల చెబుతూ ఉండడం చాలా క్యూట్ గా అనిపిస్తుంది.తను ఏం అడిగినా కూడా నాగార్జున ఇప్పటి వరకు నో చెప్పింది లేదట.తన కోరిక నెరవేర్చేంత వరకు కూడా నాగార్జున దాని గురించి ఆలోచిస్తూ కూడా ఉంటారట.

అందరి భర్తల్లాగే తన భర్త కూడా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, తననే ప్రేమిస్తాడు అంటూ చాలా గర్వంగా అమలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube