Amala Nagarjuna : నాగార్జునకు నాకు కేవలం ఆ ఒక్క విషయంలోనే గొడవలు జరుగుతాయి : అమల
TeluguStop.com
అమల నాగార్జున( Amala Nagarjuna ).ఈ జంట చాలా ఎళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.
చాలా జంటలు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక విడాకుల బాట పడుతున్నారు.
కానీ వారందరికి విరుద్ధంగా ఈ జంట ఎంతో ప్రేమతో మెలుగుతూ వస్తున్నారు.ఇంట గెలిచి బయట గెలవాలి అనే సామెతను ఈ జంట నిజం చేస్తున్నారు కూడా.
చాలామంది నాగార్జున( Nagarjuna ) కమర్షియల్ అని, టాలీవుడ్ లోనే ఆస్తిపరుడు అని, అన్ని విషయాలు బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తారు అని చెబుతారు, కానీ ఆయన కుటుంబ విషయం వచ్చే సరికి చాలా జాగ్రత్తగా ఉంటాడు, భార్య కోరికలకు విలువ ఇవ్వడం భర్తగా తన బాధ్యత అనే అనుకుంటాడు.
"""/"/
అయితే అమల( Amala Akkineni ) ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి మధ్య సాధారణ భార్యాభర్తల్లాగే గొడవలు వస్తాయని తెలిపారు, వారి గొడవలు ఎక్కువగా తను ఏదైనా చేయాలనుకున్న సమయంలో చేయలేకపోతున్నానేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుందట అమల, అందువల్లే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు చేయడానికి ప్రయత్నించు అంటూ నాగార్జున చెప్పడం స్టార్ట్ చేస్తారట, ఈ ఆర్గ్యుమెంట్( Argument ) లోనే వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుందట.
ఇక ఏ గొడవ జరిగినా కూడా అది పూర్తిగా సాల్వ్ చేసుకోకుండా నిద్రపోవడానికి ఒప్పుకోరట.
"""/"/ అది ఎలాంటి గొడవైనా కూడా పడుకునే లోపే ఖచ్చితంగా ఒక పరిష్కారం చూసుకుంటారట.
నా భర్త నాకు ఒక మంచి ఫ్రెండ్ అని, అలాగే నా లవ్ ఆఫ్ లైఫ్ అని, మంచి సపోర్ట్ సిస్టం అని, నాగార్జున లేకుండా నా జీవితంలో( Life ) ఏది సవ్యంగా జరగదు అంటూ అమల చెబుతూ ఉండడం చాలా క్యూట్ గా అనిపిస్తుంది.
తను ఏం అడిగినా కూడా నాగార్జున ఇప్పటి వరకు నో చెప్పింది లేదట.
తన కోరిక నెరవేర్చేంత వరకు కూడా నాగార్జున దాని గురించి ఆలోచిస్తూ కూడా ఉంటారట.
అందరి భర్తల్లాగే తన భర్త కూడా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, తననే ప్రేమిస్తాడు అంటూ చాలా గర్వంగా అమలు చెబుతున్నారు.
ఐసీసీ అవార్డ్స్ లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు