తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.అధికార లేక ప్రతిపక్షం ఏదైనా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని తెలిపారు.
వడ్లను బోనస్ తో కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేసిన హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం యావత్ రైతాంగం అంతా వేచి చూస్తోందని పేర్కొన్నారు.రూ.500 బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పండని ప్రశ్నించారు.ఇటీవల వచ్చిన తుఫానుతో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిచిందన్న ఆయన నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.డిసెంబర్ 9నే రైతులకు రైతుబంధు నగదు ఇస్తామన్నారన్న హరీశ్ రావు రైతులకు రూ.15 వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.







