అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కొడుకు అల్లు శిరీష్ అందరికీ సుపరిచితమైన హీరోనే.ఈయన ఇండస్ట్రీకి వచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు.

కానీ అన్న అల్లు అర్జున్ ( Allu Arjun ) లాగా స్టార్ హీరో మాత్రం అవలేకపోతున్నారు.ఇక ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా ఈయన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం లేదని ఇప్పటికే అల్లు అరవింద్ పై ఎన్నో ట్రోల్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక గతంలో అయితే అల్లు శిరీష్ కి అల్లు ఫ్యామిలీకి మధ్య బంధం తెగిపోయిందని,అల్లు శిరీష్ సినిమాలు హిట్టు కాకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడం లేదని ఇంట్లో గొడవ పెట్టుకుని మరీ ఆస్తి తనకి ఇచ్చేయమని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు అంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి.

కానీ అలాంటిదేమీ లేదు అని ఎప్పటికప్పుడు వీరి మధ్య బంధం బయట పడుతూనే ఉంది.అయితే తాజాగా అల్లు శిరీష్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేంటంటే ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్సయ్యి మరికొద్ది రోజుల్లో పెళ్లికూడా జరగబోతుంది.
అయితే వరుణ్ తేజ్ ( Varun tej ) కంటే వయసులో అల్లు శిరీష్ పెద్దవాడు.కానీ ఇప్పటివరకు కూడా అల్లు ఫ్యామిలీ( Allu Family ) అల్లు శిరీష్ కి పెళ్లి సంబంధం చూసి మ్యారేజ్ చేయడం లేదు.
అంతేకాదు ఈయన పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ఇప్పటివరకు నెట్టింట్లో ఎక్కడ వినిపించలేదు.
అయితే హీరోయిన్ల విషయంలో ఎఫైర్ వార్తలు వినిపించిన కూడా తనకు బ్రేకప్ జరిగింది అని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
అయితే ఈ విషయాలన్నింటినీ పక్కన పెడితే సోషల్ మీడియాలో మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.అదేంటంటే అల్లు శిరీష్ ( Allu Sirish ) ఇన్ని రోజులుగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ వ్యాధేనని అల్లు శిరీష్ కి ఆ వ్యాధి ఉండడం వల్లే పెళ్లికి దూరంగా ఉంటున్నాడు అంటూ ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో చాలామంది రకరకాలుగా స్పందించినప్పటికీ ఆయనకి ఉన్నది హానికరమైన వ్యాధి ఏమీ కాదు కానీ మానసికంగా ఆయన్ని ఓ జబ్బు వేధించడంతో అది పూర్తిగా తగ్గిపోయాకే పెళ్లి చేసుకుందామని అల్లు శిరీష్ డిసైడ్ అయ్యారట.ఇక ఈ విషయంలో అల్లు అరవింద్ ( Allu Aravind ) కూడా తన కొడుకుకి అందుకే పెళ్లి సంబంధాలు చూడడం లేదు అని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో వైరల్( Social Media ) అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట్లో మాత్రం జోరుగా చక్కర్లు కొడుతుంది.కానీ అల్లు అభిమానులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు.
ఎందుకంటే అల్లు శిరీష్ కంటే వయసులో పెద్దవారైనా సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఇంకా చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారు.అయితే వారికి కూడా అలాంటి వ్యాధి ఉన్నట్లేనా.
ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.