టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే బోయపాటి శ్రీను సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతోంది.
స్కంద సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో అఖండ సినిమా సాధించిన కలెక్షన్లలో 50 శాతం కలెక్షన్లను సైతం ఈ సినిమా సాధించలేదు.స్కంద మూవీ( Skanda Movie ) బోయపాటి శ్రీను గత సినిమాలను గుర్తు చేసే విధంగా ఉంది.

అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి బోయపాటి శ్రీను ఆలస్యంగా స్పందించినా ఒకింత ఘాటుగా స్పందించారు.ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు గురించి నేను ఒకటి మాత్రం చెప్పగలనని చంద్రబాబు గారితో నేను జర్నీ చేశానని తెలిపారు.చంద్రబాబు మనీ గురించి ఆలోచించరని ప్రతి మనిషి గురించి ఆలోచిస్తారని బోయపాటి శ్రీను తెలిపారు.
చంద్రబాబు నాయుడు మంచి వ్యవస్థ గురించి ఆలోచిస్తారని బోయపాటి శ్రీను అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఆయన భావిస్తారని నిజాయితీగా నిలబడే ప్రాసెస్ లో అవసరమైతే జైలుకు వెళతారని ఇంకొన్ని రోజులు జైలులో ఉండమన్నా ఉంటారని చంద్రబాబుకు జనం అంటే అంత ఇష్టమని అభివృద్ధి అంటే అంత ఇష్టమని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.

బోయపాటి శ్రీను కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. గోదావరి పుష్కరాల ఘటనను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.ఆ సమయంలో 29 మంది మరణానికి బోయపాటి శ్రీను కూడా ఒక కారణమని చాలామంది భావిస్తారు.
ఈ ఘటన అప్పట్లో ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చింది.బోయపాటి శ్రీను త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.







