తమన్నా ఫస్ట్ గెస్ట్ ఎవరంటే..!

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా హంగామా చేస్తుంది.

సినిమాలు, వెబ్ సీరీస్ లతో పాటుగా లేటెస్ట్ గా ఓ షో హోస్ట్ గా కూడా చేసేందుకు రెడీ అవుతుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా మాస్టర్ చెఫ్ షోకి హోస్ట్ గా వస్తుంది.ఈ షోలో వంటల కార్యక్రమంతో అలరించనుంది తమన్నా.

అయితే ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా అల్లు హీరో వస్తున్నాడని తెలుస్తుంది.తమన్నా షోకి మొదటి గెస్ట్ గా అల్లు శిరీష్ వస్తున్నాడని తెలుస్తుంది.

ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రాం పేజ్ లో పోస్ట్ చేశాడు.తమన్నా మాస్టర్ చెఫ్ షోకి ఫస్ట్ గెస్ట్ గా వస్తున్నందుకు ఎక్సయిటింగ్ గా ఉందని అన్నారు అల్లు శిరీష్.

Advertisement

బాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ షోని తెలుగులో తమన్నా.తమిళంలో విజయ్ సేతుపతి.

కన్నడలో సుదీప్, మళయాళంలో పృధ్విరాజ్ హోస్ట్ గా చేస్తున్నారు.మాస్టర్ చెఫ్ లో అల్లు శిరీష్, తమన్నాలు కలిసి చేసే వంటకం ఏంటి.అది ఎలా ఉండబోతుంది.

అసలు మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఏంటన్నది త్వరలో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది.ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమా చేస్తున్నాడు.

రాజేష్ శశి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మళయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ తో రొమాన్స్ చేస్తున్నాడు అల్లు శిరీష్.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు