Pushpa 2 Allu Arjun : ఎట్టకేలకు ఫిలిం సిటీలో 'పుష్ప 2' షూట్ స్టార్ట్.. కానీ అల్లు అర్జున్ లేకుండానే..

ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించాయి.ఎన్నో రోజులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

 Allu Arjun's Pushpa 2 Shooting Begins, Allu Arjun, Pushpa 2, Director Sukumar, R-TeluguStop.com

కానీ పుష్ప పార్ట్ 1 హిట్ అయిన ఇంత వరకు పార్ట్ 2 స్టార్ట్ చేయలేదు.కానీ తాజాగా ఈ సినిమా స్టార్ట్ అయినట్టు సమాచారం.

ఈ రోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ షూట్ అల్లు అర్జున్ లేకుండానే స్టార్ట్ చేశారట.

అల్లు అర్జున్ ఆయన కుటుంబం ప్రెజెంట్ దక్షిణాఫ్రికా లో ఉన్నారు.వీరు ఒక వివాహానికి అటెండ్ అయ్యేందుకు అక్కడికి వెళ్లారు.

మరి వీరు అక్కడి నుండి వచ్చిన తర్వాత ఈయన సెట్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.

ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండానే 100 కోట్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Rule-Movie

పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగాడు.ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సుకుమార్ అండ్ టీమ్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

చూడాలి మరి అల్లు అర్జున్ ఎప్పుడు తిరిగి వచ్చి షూట్ లో పాల్గొంటాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube