బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ.. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేశాడుగా!

తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా( Pan India ) ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో పుష్ప 2 సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు.దానికి తోడు పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను కాస్త మరింత పెంచేసింది.తాజాగా రిలీజైన టీజర్లో జాతర సెటప్‌లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి.

గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్( Allu Arjun ) లుక్.తన మేనరిజమ్స్, యాక్ట్స్ తో దులిపేశాడు.దీంతో ఈ సినిమాపై అభిమానులు అంచనాలను మరింత పెంచేసుకున్నారు.

Advertisement

భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 అనే మాట ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.కాగాపాన్ ఇండియా సినిమాగా రూపొందిన పుష్ప: ది రూల్ బిజినెస్( Pushpa The Rule ) పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది.ఈ సినిమా ఆడియో, డిజిటల్ రైట్స్ ఊహకు అందని విధంగా అమ్ముడుపోతున్నాయి.

థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.తాజాగా నైజాం హక్కుల అమ్మకం వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

పుష్ప 2 సినిమా థియేట్రికల్ రైట్స్( Pushpa 2 Theatrical Rights ) రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.నైజాంకు చెందిన డిస్టిబ్యూటర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొన్నాడు.ఈ మూవీ హక్కులు సుమారుగా 100 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ నిపుణులు తెలిపారు.

అయితే పుష్ప నైజాం థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డును తుడిపేసింది.రాజమౌళి( Rajamouli ) సినిమా బిజినెస్ 100 కోట్ల కంటే తక్కువగా జరిగింది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ప్రస్తుతం నైజాంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమా రిలీజ్‌కు ముందు బడా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకాడుతున్నారు.

Advertisement

బాలీవుడ్‌లో ఈ సినిమాకు పోటీగా చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు.బాలీవుడ్‌లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించుకొన్న సినిమాలు తమ మూవీ రిలీజ్‌ను వాయిదా వేసుకొంటున్నాయి.

దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా ఈసారి రికార్డులు తిరగబడడం ఖాయం అనిపిస్తోంది.

తాజా వార్తలు