ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆహా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.సరికొత్త కంటెంట్ తో స్పెషల్ షోలతో.
ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులనుఆహాఎంతగానో ఆకట్టుకుంది.నందమూరి బాలకృష్ణతో( Balakrishna ) అన్ స్టాపబుల్ టాకీ షో ద్వారా ఆహాకీ మంచి క్రేజ్ ఏర్పడింది.
అన్ స్టాపబుల్రెండు సీజన్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ఆహా రెడీ కావడం జరిగింది.
ఈ క్రమంలో ఆహా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కొత్త లుక్ ఫోటో విడుదల చేసి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయడం జరిగింది.”ICON STAR అల్లు అర్జున్ నీ మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు.కానీ ఈసారి బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురాబోతోంది.
“ది బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ కోసం సిద్ధంగా ఉండండి” అని పోస్ట్ చేయటం జరిగింది.ఆహా లేటెస్ట్ పోస్ట్ తో అల్లు అర్జున్( Allu Arjun ) అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ జన్మదినోత్సవం నేపథ్యంలో ఖచ్చితంగా “ఆహా” పెద్ద కార్యక్రమం ప్లాన్ చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బన్నీ “పుష్ప 2( Pushpa 2 ) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ సినిమా మొదటి షెడ్యూల్ విశాఖపట్నంలో తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది.
ఇప్పుడు బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు సమాచారం.