ఇదేంటి బన్నీ ..? పవన్ కు మద్దతిస్తూనే వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ?

మరో రెండు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతుండడంతో, ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, ప్రజలకు రకరకాల మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నాయి.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమయ్యారు.

తమ పార్టీ గెలుపు కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు.ఇక ఇప్పటికే సినిమా రంగానికి చెందిన వారు సైతం పలానా పార్టీని, అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతూ మీడియా, సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులను కోరుతున్నారు.

కొంతమంది సినిమా రంగానికి చెందినవారు నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోతున్నారు.ముఖ్యంగా పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం తో అక్కడ సినిమా రంగానికి చెందినవారు చాలామందే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక మెగా కుటుంబానికి చెందిన హీరోలు చాలామంది ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు.ఇక మెగా కాంపౌండ్ కు చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )సైతం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా తన మద్దతును తెలియజేసారు.పవన్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.ఒకవైపు జనసేనకు, పవన్ కు అల్లు అర్జున్ మద్దతు ఇస్తూనే, మరోవైపు తన స్నేహితుడైన నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు.

ఈ మేరకు ఈరోజు ఉదయం రవిచంద్ర కిషోర్ రెడ్డి( Ravichandra kishore Reddy ) వద్దకు తన భార్య స్నేహ రెడ్డితో కలిసి నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్ళనున్నారు.దీంతో రాజకీయంగా అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం వరకే అల్లు అర్జున్ పరిమితమవుతారా లేక, ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు తన స్నేహితుడైన అల్లు అర్జున్ తనను కలిసేందుకు నంద్యాలకు వస్తూ ఉండడంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.అల్లు అర్జున్ కు భారీగా స్వాగతం పలికేందుకు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు.ఒకవైపు పవన్ కు మద్దతు పలుకుతూనే .మరోవైపు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ వెళ్తుండడంతో ఈ వ్యవహారం రాజకీయంగాను ప్రాధాన్యం సంతరించుకుంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు