టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ( Sneha Reddy ) ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
తరచూ ట్రెండీ ఔట్ ఫిట్ తో ఫోటో షూట్స్ చేసి వాటిని షేర్ చేస్తూ ఉంటారు.
ఇక స్నేహ రెడ్డి తన ఫ్యామిలీ , పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.ఇక ఈమె కనుక ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుందని అందరూ భావించారు.అయితే అందరూ అనుకున్న విధంగా ఇవే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు.
కానీ హీరోయిన్ గా కాకుండా ఒక యాడ్ చేస్తూ మొదటిసారి స్నేహ రెడ్డి కెమెరా ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కిండర్( Kinder ) బ్రాండ్ కు సంబంధించిన కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేశారు.ఇందులో ఈమె చాలా నాచురల్ లుక్ లో కనిపించే సందడి చేశారు.ఇక ఈ యాడ్ షూట్ లో మరొక అబ్బాయి కూడా కనిపించారు.అయితే ఆ అబ్బాయి స్థానంలో అల్లు ఆయాన్ ( Allu Ayaan ) కనుక ఉండి ఉంటే మరో లెవల్ లో ఈ యాడ్ ఉండేదని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ యాడ్ లో స్నేహ రెడ్డి అచ్చం హీరోయిన్ లాగా ఉన్నారని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్స్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.