సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కావడంతో పాటు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా గుంటూరు కారం( Guntur Kaaram ) నిలిచింది.త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఈ సినిమాకు దర్శకుడు కావడం, హారిక హాసిని నిర్మాతలు ఒకింత భారీ బడ్జెట్ తో నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో నటించారు.
కథ

వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేశ్ బాబు) బాల్యంలోనే తల్లి వసుంధర (రమ్యకృష్ణ)కు వేర్వేరు కారణాల వల్ల దూరంగా పెరుగుతాడు.తండ్రి రాయల్ సత్యం(జయరాం) క్లాస్ అయితే కొడుకు మాత్రం ఊరమాస్ గా ఉంటాడు.తల్లికి దూరంగా జీవనం సాగిస్తున్న రమణకు 25 సంవత్సరాల తర్వాత తల్లి నుంచి పిలుపు వస్తుంది.
ఆస్తులు అవసరం లేదని, తనకు తన కొడుకు ఎలాంటి సంబంధం లేదని వసుంధర సంతకాలు పెట్టాలని రమణను ఎందుకు కోరుతుంది?.
వసుంధర రెండో పెళ్లి చేసుకోవడానికి కారణాలేమిటి? రమణ, అమ్ము(శ్రీలీల)( Sreeleela ) మధ్య ప్రేమ ఎలా పుట్టింది? మరదలు రాజి(మీనాక్షి చౌదరి) ( Meenakshi Chaudhary )రోల్ ఏంటి? రమణ తాత(ప్రకాష్ రాజ్) రాజకీయ భవిష్యత్తు కొరకు వేసిన ఎత్తులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
విశ్లేషణ :

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారు.త్రివిక్రమ్ సినిమా హిట్టైనా ఫ్లాపైనా ఆయన రచనలకు, మాటలకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ కు కొదువ లేదు.గుంటూరు కారం కథ బాగానే ఉన్నా కథనం విషయంలో త్రివిక్రమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా విందు భోజనం అనే చెప్పాలి.
మహేష్ బాబు ( Mahesh Babu )స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు డ్యాన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.అమ్ము, రాజీ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.
గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా త్రివిక్రమ్ ఫ్యాన్స్ ను మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేదు.సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయినా సినిమాలో లోపాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.
త్రివిక్రమ్ గత సినిమాల ఛాయలు ఉన్న గుంటూరు కారం సాధారణ ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.
థమన్ బీజీఎం విషయంలో మాత్రం నిరాశపరిచారు.సినిమాటోగ్రఫీ, ఇతర టెక్నికల్ అంశాలకు సంబంధించి మూవీ టాప్ లెవెల్ లో ఉంది.నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్లు :

మహేష్ బాబు( Mahesh Babu ) నటన, డ్యాన్స్
మహేష్, రమ్యకృష్ణ కాంబో సీన్స్
సంగీతం
మైనస్ పాయింట్లు :
కథనం, బీజీఎం ,సాగదీత సన్నివేశాలు ,త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు లేకపోవడం
బాటమ్ లైన్ :
ఘాటు తగ్గిన గుంటూరు కారం







