రక్తహీనత, నీరసం బాగా వేధిస్తున్నాయా.. ఇలా చేస్తే వారంలో వాటికి బై బై చెప్పవచ్చు!

పిల్లలు, మహిళలు, గర్భిణీల్లో అత్యధికంగా తలెత్తే సమస్యల్లో రక్తహీనత( anemia ) ముందు వ‌రుస‌లో ఉంటుంది.శరీరంలో రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యనే రక్తహీనత అని అంటారు.

 If You Take This Juice Regularly, Anemia And Fatigue Will Go Away! Anemia, Fatig-TeluguStop.com

రక్తహీనత వచ్చిందంటే దానితో పాటే ఎన్నో సమస్యలను కూడా మోసుకొస్తుంది.అందులో నీరసం ఒక‌టి.

మిమ్మల్ని కూడా రక్తహీనత, నీరసం బాగా వేధిస్తున్నాయా.? వాటిని వదిలించుకోవడం ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ జ్యూస్ ను మీరు తాగాల్సిందే.నిత్యం ఈ జ్యూస్‌ను తీసుకుంటే వారం రోజుల్లో ర‌క్త‌హీన‌త‌, నీర‌సం స‌మ‌స్య‌ల‌కు బై బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అరటి పండుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Anemia, Carrot Banana, Fatigue, Tips, Healthy, Latest-Telugu Health

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్( Carrot ) ముక్కలు, అరటిపండు ముక్కలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన క్యారెట్ బనానా జ్యూస్ సిద్ధం అవుతుంది.ఎంతో రుచికరంగా ఉండే ఈ జ్యూస్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

Telugu Anemia, Carrot Banana, Fatigue, Tips, Healthy, Latest-Telugu Health

రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరంలో రక్త కణాల వృద్ధి జరుగుతుంది.రక్తహీనత దూరం అవుతుంది.అలాగే నీరసం మళ్లీ మీ వంక చూడకుండా పరారవుతుంది.

ఎముకల దృఢత్వానికి, కండరాల నిర్మాణానికి ఈ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాదు క్యారెట్ బనానా జ్యూస్ ను తయారు చేసుకుని నిత్యం తీసుకుంటే కంటి చూపు మెరుగు పడుతుంది.

అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడతారు.మరియు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube