ఆ రీమేక్‌ చేసేంత ధైర్యం, దమ్ము బన్నీకి ఉందా?

తమిళంలో ఈమద్య వచ్చిన ‘96’ చిత్రం గురించి టాలీవుడ్‌లో కూడా తెగ చర్చించుకుంటున్నారు.అక్కడ చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Allu Arjun Want To Act In 96 Movie Remake-TeluguStop.com

టీవీలో ప్రసారం అయిన తర్వాత కూడా థియేటర్‌లో ఈ చిత్రం మంచి షేర్‌ను దక్కించుకుని అరుదైన రికార్డును పొందింది.అలాంటి ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ మరియు రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కొనుగోలు చేయడం జరిగింది.

మొదట ఈ చిత్రాన్ని డబ్‌ చేసి విడుదల చేయాలనుకున్న దిల్‌రాజు అక్కడ సక్సెస్‌ అవ్వడంతో ఇక్కడ రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడు.అయితే 96 చిత్రం చేసేంత దమ్ము ధైర్యం తెలుగు హీరోల్లో ఎవరికి లేదు అనే టాక్‌ వినిపిస్తుంది.

‘96’ కథ విషయానికి వస్తే.స్కూల్‌ డేస్‌ ప్రేమ, హీరో భయపడి హీరోయిన్‌కు ప్రేమను చెప్పలేక పోతాడు.దాంతో హీరోయిన్‌కు హీరోపై ప్రేమ ఉన్నా కూడా హీరో ముందుకు రాని కారణంగా వేరే పెళ్లి చేసుకుంటుంది.హీరోయిన్‌ పెళ్లి అయిన తర్వాత కూడా హీరో ఆమె జ్ఞాపకాలతో బతికేస్తూ ఉంటాడు.మళ్లీ 20 ఏళ్ల తర్వాత స్కూల్‌ స్నేహితులు అంతా కూడా గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకుంటారు.20 ఏళ్ల తర్వాత కలిసిన హీరో, హీరోయిన్‌ భావనలు ఏంటీ, అప్పటి ప్రేమ విషయాన్ని 20 ఏళ్ల తర్వాత చెప్పిన సమయంలో వారి మనో భావాలు ఎలా ఉన్నాయనేది కథాంశం.ఒక నెగటివ్‌ ఎండ్‌ కలిగిన ఈ చిత్రం తెలుగులో బన్నీ రీమేక్‌ చేస్తాడని అంటున్నారు.

ఈ చిత్రంలో హీరో పాత్ర మద్య వయస్కుడి పాత్ర.అటువంటి పాత్రను బన్నీ చేస్తాడని ఎవరు అనుకోవడం లేదు.ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని సినిమా అవ్వడంతో పాటు, ఎక్కువ సమయం 10వ తరగతి సీన్స్‌ ఉంటాయి.

అంటే అల్లు అర్జున్‌ కాకుండా వేరే కుర్రాడు ఆ పాత్రలో కనిపించాల్సి ఉంటుంది.మరి ఇలాంటి సినిమాను బన్నీ చేస్తాడా.ఒక వేళ చేసినా కూడా తెలుగు ఆడియన్స్‌ ఆధరిస్తారనే నమ్మకం లేదు అంటున్నారు సినీ వర్గాల వారు.సినిమాను డబ్‌ చేసి విడుదల చేయడం ఉత్తమమైన మార్గం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube