శాకుంతలం సెట్స్ కు వెళ్లి కూతురును సర్ప్రైజ్ చేసిన బన్నీ..పిక్ వైరల్!

అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్న తన పిల్లలతో మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు.

తాజాగా కూతురు కోసం అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి మరి శాకుంతలం సెట్స్ కు వెళ్ళాడు.

అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుందని అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా ద్వారా అర్హ బాల నటిగా మన ముందుకు రాబోతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం.ఈ సినిమాలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటించ బోతుంది.

ప్రస్తుతం శాకుంతలం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ షూటింగ్ లో అల్లు అర్హ పాల్గొంటుంది.

Advertisement

అందుకే అల్లు అర్జున్ తన గారాలపట్టికి సర్ప్రైజ్ ఇవ్వాలని శాకుంతలం సెట్స్ లోకి అడుగు పెట్టాడు.

సెట్ లోకి అడుగు పెట్టిన బన్నీ కొంత సమయం అక్కడే ఉండి అల్లు అర్హ షూటింగ్ ను దగ్గర ఉండి గమనించారు.అల్లు అర్జున్ తో పాటుగా తన భార్య అల్లు స్నేహ, కుమారుడు అల్లు అయాన్ కూడా సెట్స్ లో సందడి చేసారు.సెట్ లోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ని డైరెక్టర్ గుణ శేఖర్, నిర్మాత నీలిమ బొకే తో స్వాగతం పలికారు.

చిత్ర యూనిట్ తో కూడా అల్లు అర్జున్ కొంత సమయం గడిపి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే అల్లు అర్జున్, స్నేహ అయాన్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమా కూడా పాన్ ఐడియా సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అక్కినేని సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

శకుంతల, దుష్యంతుడి అందమైన ప్రేమ కథను గుణశేఖర్ మన ముందుకు తీసుకు రాబోతున్నాడు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.మొదటి సినిమాతోనే పాన్ ఇండియా సినిమాలో కనిపించే బోతున్న అర్హ ను గుణశేఖర్ ఎంతబాగా ప్రెసెంట్ చేస్తారో వేచి ఉండాల్సిందే.

Advertisement

తాజా వార్తలు