ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ.. ఆ స్టార్ట్ డైరెక్టర్ తోనే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.రష్మిక మందన్న నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంది.

350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైడ్ గా మారింది.

ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పుష్ప ది రైజ్ పేరుతో మొదటి పార్ట్ ను రిలీజ్ చేయగా ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ పేరుతో రెండవ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు సుకుమార్.

ఈ సినిమాను మరింత బడ్జెట్ తో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించ బోతున్నారు.ఇక ఇది ఇలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

Advertisement
Allu Arjun & Trivikram Srinivas' New Movie In Final Stage, Mahesh Babu, Trivikra

తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ లైనప్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.ఈయన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి.

ఇక ఈ ప్రాజెక్ట్ పై మరో అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు సంబంధించి కథ చర్చలు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయని.

త్రివిక్రమ్ సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతుంది.మరి ఈ ప్రాజెక్ట్ 2023 సమ్మర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.

Allu Arjun Trivikram Srinivas New Movie In Final Stage, Mahesh Babu, Trivikra

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వచ్చాయి.మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ విజయం అందుకున్న ఈ కాంబో నాల్గవ సినిమా అంటే అంచనాలు పీక్స్ కు చేరుకోవడం ఖాయం.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

త్రివిక్రమ్ ప్రెజెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు