అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా తాజాగా ప్రారంభం అయింది అంటూ వార్తలు వచ్చాయి.కానీ అల్లు అర్జున్ మాత్రం ఆఫ్రికా పర్యటనకు భార్య పిల్లలతో కలిసి వెళ్ళాడు.
అక్కడ తనకు అత్యంత ఆప్తుడైన ఒక వ్యక్తి యొక్క వివాహానికి అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడని తెలుస్తోంది.వచ్చే వారానికి కానీ అల్లు అర్జున్ ఇండియా కు తిరిగి వచ్చే పరిస్థితి లేదు.
ఈ సమయం లో కూడా సుకుమార్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు అనధికారికంగా చెబుతున్న దాని ప్రకారం అల్లు అర్జున్ లేని సన్నివేశాలను సుకుమార్ రూపొందిస్తున్నాడట.
అందుకు సంబంధించిన ప్లాన్ ముందుగానే అనుకున్నారని.గతం లో కూడా అల్లు అర్జున్ లేకుండానే పుష్ప మొదటి షెడ్యూల్ ని సుకుమార్ పూర్తి చేశాడు.

సెంటిమెంట్ ప్రకారం మొదటి షెడ్యూల్ కి అల్లు అర్జున్ లేకపోతే కచ్చితం గా సూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశం తో సుకుమార్ ఈ పని చేశాడు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.నవంబర్ మూడవ వారం లేదా నాలుగవ వారంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం అందుతుంది.రష్మిక మందన డిసెంబర్ లో షూటింగ్ కి హాజరవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హాట్ బ్యూటీని ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.పుష్ప 1 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని దాదాపుగా 350 కోట్ల రూపాయల వసూళ్ల ను నమోదు చేయడం జరిగింది.
కనుక పార్ట్ 2 కనీసం 500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తేనే పరువు దక్కించుకుంటుంది.మరి ఆ స్థాయి కలెక్షన్స్ నమోదు అయ్యేనా చూడాలి.