టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల తన కొడుకు అయాన్(Ayaan ) ను సోషల్ మీడియాలో తెగ హైలెట్ చేస్తున్నారు.
ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు తన కుమారుడిని చాలా దూరంగా ఉంచారు.కేవలం స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అల్లు అర్జున్ ఇద్దరు కూడా తన కుమార్తె అర్హ( Arha) ను హైలైట్ చేస్తూ వచ్చారు.కానీ ఇటీవల కాలంలో ఈ దంపతులిద్దరూ కూడా తమ కుమారుడు అయాన్ ను హైలెట్ చేస్తూ ఉన్నారు.
తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అయాన్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో అయాన్ మోడల్ అంటూ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.అలాగే షారుఖ్ ఖాన్ సినిమాలోని పాటను హమ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇటీవల వీళ్లిద్దరు పెళ్లిరోజు సందర్భంగా ఆయన కేక్ తింటూ ఉన్నటువంటి ఫోటో కూడా తెగ వైరల్ అయింది.
ఇదిలా ఉండగా స్నేహ రెడ్డి ఇటీవల తన కొడుకుకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇందులో భాగంగా అయాన్ పెద్ద ఎత్తున వర్కర్స్ చేస్తూ ఉన్నారు తమ జిమ్ ట్రైనర్ తో కలిసి ఈయన బాక్సింగ్ ఆడటమే కాకుండా పెద్ద ఎత్తున వెయిట్ లిఫ్ట్ చేస్తూ కనిపించారు .ఇలా ఇటీవల కాలంలో అయాన్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ తనని హైలెట్ చేయడానికి కారణం లేకపోలేదు.ఇప్పటినుంచే అందరి దృష్టి తనపై పడేలా ఈ దంపతులు తన కొడుకును సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు.
త్వరలోనే ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకే ఇప్పటి నుంచి తనకు అన్ని విషయాలలోనూ శిక్షణ ఇప్పించడమే కాకుండా ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ విధంగా అల్లు అర్జున్ వారసుడిగా అయాన్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కోసమే ఎప్పటినుంచి పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించే పనులలో బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో మోడల్ కాదు అప్ కమింగ్ స్టార్ హీరో అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వీడియోలు పై కామెంట్లు చేస్తున్నారు.