టాలీవుడ్ మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల( Lavanya Tripathi ) ఎంగేజ్మెంట్ వేడుకలు ముగిసాయి.ఇరువురి కుటుంబ సభ్యులు కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మాత్రమే వీరి ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగాయి.
ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎట్ట కేలకు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేశారు.
ఇక ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు నెటిజన్స్ ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సూపర్ జోడి క్యూట్ కపుల్ అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) బావ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ని ఉద్దేశిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.లావణ్య త్రిపాఠి చావు కబురు చల్లగా సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై 2021లో విడుదల అయింది.ఈ చిత్రానికి అల్లు అరవింద్( Allu Aravind ) సమర్పకుడిగా వ్యవహరించారు.
కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య చక్కగా తెలుగులో మాట్లాడటాన్ని ఉద్దేశిస్తూ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తుంది.ఇక్కడే ఒక కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా ఈ అమ్మాయి అంటూ ఆరోజు ఆయన స్టేజ్‌పై నవ్వులు పూయించారు.దాంతో అందుకు సంబంధించిన వీడియోని అల్లు అర్జున్ షేర్ చేస్తూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల ఫోటోలు జత చేశారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదే వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన బన్నీ తన తండ్రి తెలివైన వారని, లావణ్య తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందని ముందే గ్రహించారని పేర్కొన్నారు.