న్యూయార్క్ లో గంగోత్రి హీరోయిన్ ని సీక్రెట్ గా కలిసిన అల్లు అర్జున్.. వైరల్ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా నిలిచి ఓ రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ కు ఈ సినిమా మంచి గుర్తింపు అందించింది.

తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత బన్నీ, ఆర్య వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి స్టార్ హీరోగా మార్చాయి.అలా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.

ఇక ఈయన మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో 2011లో స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

Advertisement

తనకు సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో లగేజ్ సర్దుకొని విదేశ ప్రయాణాలు చేస్తాడు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతూ మంచి భర్తగా, మంచి తండ్రిగా నిలిచాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహ రెడ్డి, అల్లు అర్జున్ ల జంట క్యూట్ కపుల్ గా నిలిచింది.ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కనిపిస్తుంటారు.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ప్రజలతో మంచి పరిచయాన్ని పెంచుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా కు సంబంధించిన సర్వేలో స్నేహ రెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.

ఏ స్టార్ హీరోల భార్యలు, స్టార్ హీరోయిన్ లు కూడా అందుకొని గుర్తింపును సొంతం చేసుకుంది.తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా అప్ డేట్ లను, ఫోటోలను, పిల్లలతో సరదాగా ఆడుతున్న వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ దంపతులు సరదాగా న్యూయార్క్ ట్రిప్ కి వెళ్లారు.

Advertisement

ఇక దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటుంది.మొత్తానికి అల్లు అర్జున్ కు షూటింగ్ లో కాస్త బ్రేక్ రావడంతో తన ఫ్యామిలీతో ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు.ఇక ఆయనకు న్యూయార్క్ లో గంగోత్రి హీరోయిన్ కనిపించింది.

ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గంగోత్రి సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా తనకు అల్లు అర్జున్ కనిపించడంతో ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంటూ.కొన్ని స్వీట్ కామెంట్లు చేసింది.

ప్రస్తుతం ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు లైకులు కొడుతున్నారు.

తాజా వార్తలు