మంచు విష్ణుకు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. టచ్ చేసావ్ అంటూ బన్నీ పోస్ట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల పుష్ప( Pushpa ) సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన ఉత్తమ జాతీయ నదులుగా అవార్డు రావడంతో సినిమా సెలబ్రిటీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Allu Arjun React On Manchu Vishnu Post Tweet Goes Viral, Manchu Vishnu, Allu Arj-TeluguStop.com

ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు( Manchu Vishnu ) సైతం మా అసోసియేషన్ తరపున అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లేఖ రాశారు.ఈ లేఖ పై అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు రాసిన లేఖపై అల్లు అర్జున్ స్పందిస్తూ.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌( President of Movie Artist Association ) మంచు విష్ణు గారికి ధన్యవాదాలు.ఈ అందమైన ఉత్తరానికి థ్యాంక్స్.ఈ ప్రశంసలను నన్ను ఎంతగానో టచ్ చేశాయి.నా హృదయాన్ని తాకాయి త్వరలోనే వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుస్తాను అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో పుష్ప 2( Pushpa 2 ) పై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక విష్ణు ఒకవైపు మా అధ్యక్షుడిగా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.తాజాగా ఈయన కొత్త సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube