గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్ల ను పుష్ప సినిమా రాబట్టింది.
హిందీ లో జీరో పబ్లిసిటీ తో ఏకంగా వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఘనత కేవలం పుష్ప కి మాత్రమే దక్కింది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు చేయడం తో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పుష్ప సినిమా ఎన్నో అవార్డులను మరియు రివార్డులను దక్కించుకుంటూ ఉంది.
ఆ మధ్య సైమా లో అరడజను కు పైగా అవార్డులు వచ్చాయి.ఇక ఫిల్మ్ ఫేర్ లో కూడా పుష్ప సత్తా చాటింది.
ఇప్పుడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ల్లో కూడా పుష్ప సినిమా జోరు కనిపించింది.చాలా అవార్డు లు పుష్ప యూనిట్ సభ్యులు దక్కించుకున్నారు.

అల్లు అర్జున్.సుకుమార్ తో పాటు పలువురు నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా ఈ అవార్డును సొంతం చేసుకోవడంతో మళ్లీ పుష్ప యొక్క జోరు కనిపించింది.అన్ని చోట్ల కూడా పుష్ప గురించిన మాటలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పుష్ప 2 ప్రారంభం అవ్వాల్సి ఉంది.పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా రెండవ పార్ట్ పై అంచనాలు భారీ గా ఉన్నాయి.ఆ అంచనాలు అందుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ను మరింత ఆలస్యం చేస్తున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో సినిమా ను పట్టాలెక్కించి వచ్చే ఏడాది డిసెంబర్ లో సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.పుష్ప 1 ను డిసెంబర్ లో విడుదల చేసి సక్సెస్ అయ్యారు.
కనుక పుష్ప 2 సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసి పెడుతుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.