అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2( Pushpa2 ) సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.పుష్ప సినిమా ఆడియో ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇంకా ఈ సినిమా యొక్క వసూళ్ల విషయమై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది అంటూ సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు.అంతే కాకుండా పుష్ప 2 సినిమా లోని పాటలు అన్నీ కూడా చాలా స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 కోసం చాలా సమయం కేటాయించి మరీ పాటలను ట్యూన్ చేస్తున్నాడు.పాటల యొక్క షూటింగ్ ను త్వరలో సుకుమార్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్( DSP ) ఏకంగా 7.5 కోట్ల రూపాయల పారితోషికం ను అందుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కనుక ఏ స్థాయి లో సంగీతం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.పుష్ప సినిమా యొక్క స్థాయిని పెంచడం లో కీలక పాత్ర పోషించిన సంగీతం ఇప్పుడు పుష్ప 2 లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది.
హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె పేరు పై పుష్ప లో ఒక పాట ఉంది.ఇప్పుడు మరో పాట కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఐటం సాంగ్ మొదలుకుని ప్రతి ఒక్క సాంగ్ కూడా ఈ సినిమా లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఆకట్టుకునే కథ తో ఈ సినిమాను రూపొందిస్తున్న సుకుమార్ తనకు ఉన్న మంచి మ్యూజిక్ సెన్స్ తో మంచి ఆల్బమ్ ను దేవి శ్రీ తో చేయిస్తాడనే నమ్మకం ఉంది.