కర్ణాటకలో ట్రెండ్ సెట్ చేస్తున్న పుష్ప 2 ...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా డిఫరెంట్ సినిమాలని తెరకెక్కించే డైరెక్టర్ గా తెలుగు లో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా కర్ణాటక హక్కులకు ఏకంగా 40 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) టాలీవుడ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఆఫర్ అంటే అది రికార్డ్ అనే చెప్పాలి.కర్ణాటక లో కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది అనడానికి ఈ ఒక్క సంఘటననే మనం ఉదాహరణ గా తీసుకోవచ్చు… ఇక ఈ 40 కోట్ల ఫిగర్ ని చూస్తుంటే పుష్ప2 మూవీ బిజినెస్ వరల్డ్ వైజ్ గా ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు…

 Allu Arjun Pushpa 2 Kannada Rights Huge Offer Details, Pushpa 2, Allu Arjun, Pus-TeluguStop.com

పుష్ప1 మూవీ కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో పుష్ప2 మూవీకి ఈ రేంజ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం…1000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.పుష్ప1 డిసెంబర్ నెలలో రిలీజ్ కాగా పుష్ప2 మూవీ కూడా అదే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.పుష్ప2 మూవీలో రష్మిక, అనసూయ పాత్రలకు ప్రాధాన్యత పెరగనుందని బోగట్టా.

Telugu Allu Arjun, Anasuya, Sukumar, Icon Allu Arjun, Pushpa, Pushpa Kannada-Mov

విదేశాల్లో కూడా పుష్ప2 మూవీని షూట్ చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమాలో డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బన్నీ ఫ్యాన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…పుష్ప2 సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.పుష్ప2 సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పుష్ప2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…

 Allu Arjun Pushpa 2 Kannada Rights Huge Offer Details, Pushpa 2, Allu Arjun, Pus-TeluguStop.com
Telugu Allu Arjun, Anasuya, Sukumar, Icon Allu Arjun, Pushpa, Pushpa Kannada-Mov

పుష్ప2 సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు.ఈ నిర్మాతల ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.రాబోయే రోజుల్లో కూడా బన్నీకి వరుస విజయాలు దక్కాలని కెరీర్ పరంగా అల్లు అర్జున్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు…ఇక ఈ సినిమా తో అల్లు అర్జున్ ఇండియా లోనే స్టార్ హీరోగా అవతరించడం ఖాయం అని మరింకొందరు సిని పెద్దలు చెప్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube