స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు తగిన పాత్రలు వచ్చిన సందర్భాలు మాత్రం చాలా అరుదు అని చెప్పవచ్చు.
పుష్ప ది రూల్ ( pushpa the rule )సినిమాలో మాత్రం అల్లు అర్జున్ కు అలాంటి పాత్ర దక్కింది.జాతర ఎపిసోడ్ లోని సీన్ తో బన్నీ సామాన్యులను సైతం కదిలించారని చెప్పవచ్చు.
బన్నీ ఎక్స్ ప్రెషన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
అల్లు అర్జున్ తన భార్యకు కూతురు పుట్టాలంటూ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ ను కదిలించాయి.
అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాలో న భూతో న భవిష్యత్ అనే పర్ఫామెన్స్ తో అదరగొట్టారు.రష్మిక, శ్రీలీల( Rashmika, Srileela ) సైతం తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.
రష్మిక లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.శ్రీలీల సైతం కిస్సిక్ సాంగ్ లో దుమ్ము లేపారనే చెప్పాలి.

పుష్ప ది రూల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది.పుష్ప ది రూల్ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంది.పుష్ప ది రూల్ సినిమా నార్త్ ఇండియాలో బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడగా ఈ సినిమాతో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పుష్ప ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలంటే 1100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది.పుష్ప ది రూల్ సినిమా టాలీవుడ్ గ్రేట్ సినిమాలలో ఒకటి కాగా పుష్ప ది ర్యాంపేజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బన్నీ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.