నాగచైతన్య ( Nagachaitanya ) శోభిత( Sobhita ) మెడలో మూడుముళ్ళు వేశారు.అయితే వీరిద్దరూ కొత్త జీవితం ప్రారంభించబోతున్న నేపథ్యంలో నాగచైతన్య పిల్లలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈయన పిల్లల( kids ) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల నాగచైతన్య రానా వ్యాఖ్యత వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి షో ( The Rana Daggubati Show ) అనే పేరిట ఒక టాక్ షో ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో నాగచైతన్యను రానా ఎన్ని రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

చైతూ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ జీవితంలో పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండటమే అంటూ ఈయన మాట్లాడారు.వీరిద్దరితోనే తన ప్రపంచం మొత్తం గడిచిపోతుందని వారితో చాలా సమయం గడుపుతానని అన్నాడు.ఒకవేళ తనకు మగ బిడ్డ పుడితే అతనితో కలిసి గో కార్టింగ్ కి వెళ్తానని పేర్కొన్నాడు.కూతురు పుడితే కనుక తనకు నచ్చిన విధంగా తన కూతురు అభిరుచులకు అనుగుణంగా తాను సమయం గడుపుతాను అంటూ ఈ సందర్భంగా చైతన్య పుట్టబోయే పిల్లల గురించి కూడా ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక నాగచైతన్య పెళ్లి జరుగుతున్న రోజే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా విడుదల కావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక పిల్లల విషయంలో శోభిత ( Sobhita ) కూడా ఇదివరకే ఎన్నో విషయాలు వెల్లడించారు.తనకు అమ్మను కావాలని ఉంది అంటూ ఈమె పలు సందర్భాలలో వెల్లడించారు.ఇలా పిల్లలు గురించి వీరిద్దరు ఆలోచనలు చేస్తుంటే త్వరలోనే పిల్లల గురించి గుడ్ న్యూస్ చెబుతారని అభిమానులు కూడా భావిస్తున్నారు.







