స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) చాలా విషయాలలో ఇతర హీరోలకు భిన్నంగా ఉంటారు.స్టైలిష్ గా కనిపించడానికి ఈ హీరో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహం( wax statue ) ఏర్పాటు చేయడం గురించి బన్నీ స్పందిస్తూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి.మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం గురించి స్పందిస్తూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకరోజు నేను ఆఫీస్ కు వెళ్లగానే అక్కడి వాళ్లందరూ నిలబడి నన్ను చూసి నవ్వుతున్నారని అల్లు అర్జున్ పేర్కొన్నారు ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదని బన్నీ అన్నారు.కొంత సమయానికి వాళ్లు నాకొక లెటర్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ లెటర్ కూడా పూర్తిగా చదవలేదని ఆ లేఖలో మేడమ్ టుస్సాడ్స్ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం చూసిన వెంటనే నాకు చాలా సంతోషంగా అనిపించిందని బన్నీ వెల్లడించారు.నన్ను నేను చూసుకున్నట్టు అనిపించిందని బన్నీ అన్నారు.హెయిర్ పార్ట్ అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు.
నాకు సంబంధించిన మోస్ట్ ఐకానిక్ ఫోజులలో తగ్గేదేలే ఫోజు ఒకటి అని బన్నీ వెల్లడించారు.ప్రతి ఒక్కరూ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని సందర్శించి తన విగ్రహంతో ఫోటోలు దిగాలని ఆయన కోరారు.
బన్నీ తన కష్టంతో ఈ స్థాయికి ఎదగడాన్ని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.అల్లు అర్జున్ క్రేజ్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తుండగా ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రేపు పుష్ప2 సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.