ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ఒక్క సినిమా తోనే ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచు కున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.
ఇంతకు ముందు ఈయన సినిమా వస్తుంది అంటే సౌత్ ప్రేక్షకులు మాత్రమే ఎదురు చూసే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈయన సినిమా అంటే పడి చచ్చిపోయే రేంజ్ కు అల్లు అర్జున్ తీసుకు వచ్చాడు.గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
హిందీలో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 ఘన విజయంతో పార్ట్ 2 అంచనాలు అమాంతం పెరగడంతో సుకుమార్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ పై మునుపటి కంటే మరింత ఫోకస్ పెట్టి సుక్కు స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ షూటింగ్ కూడా స్టార్ట్ కాక ముందే అప్పుడే 3 పాటలను కూడా కూడా పూర్తి చేసాడు.తాజాగా ఈ విషయాన్నీ ఈయనే స్వయంగా చెప్పినట్టు తెలుస్తుంది.అలాగే సినిమా షూటింగ్ ను కూడా సెప్టెంబర్ నెల నుండి స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం అయ్యాయని దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.ఇక ఈసారి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.