అల్లు వారు మరీ ఇంత పిసినారి ఏంటో?

అల్లు అరవింద్‌ ప్రారంభించిన ఆహా ఓటీటీ కంటెంట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుంది.మెగా ఓటీటీ అంటూ చాలా మంది సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకున్నారు.

 Allu Aravindh Aha Make The Low Budjet Web Series, Aha, Allua Aravindh, Webseries-TeluguStop.com

కాని కంటెంట్‌ తక్కువ పెట్టడంతో పాటు లోక్వాలిటీ కంటెంట్‌ పెడుతున్న నేపథ్యంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అమెజాన్‌ నెట్‌ప్లిక్స్‌ స్థాయి కంటెంట్‌ సాధ్యం కాకపోయినా కనీసం అందులో సగం క్వాలిటీని అయినా మెయింటెన్‌ చేయవచ్చు కదా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఆహాలో ఉన్న వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ మూవీస్‌ అన్ని కూడా లోబడ్జెట్‌ ఏవి కూడా యాబై లక్షలకు పైబడిన బడ్జెట్‌తో తెరకెక్కి ఉండదు అంటూ విమర్శలు చేస్తున్నారు.ఓటీటీ పెట్టగానే సరిపోయిందా.

అందుకోసం కోట్లు ఖర్చు పెట్టి కంటెంట్‌ను నిర్మిస్తే ఏం అంటున్నారు.ప్రేక్షకుల నుండి లోక్వాలిటీ కంటెంట్‌తో డబ్బులు లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు.

ఆహా నుండి చాలా ఆశించామని కాని ఇప్పుడు అందులో సగం కూడా రావడం లేదని అంటున్నారు.

లోబడ్జెట్‌ సినిమాలను తీసుకోవడంతో పాటు వెబ్‌ సిరీస్‌ విషయంలో కూడా క్వాలిటీ పాటించక పోవడం చూస్తుంటే అల్లు అరవింద్‌ మరీ ఇంత పిసినారి ఏంటో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

క్వాలిటీ మరియు క్యాంటిటీ రెండు కూడా ముఖ్యమే.ఈ రెండు ఓటీటీకి చాలా ప్రధానం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు ఉంటేనే ఓటీటీ ని ప్రేక్షకులు ఆధరిస్తారు. సబ్‌ స్క్రైబర్స్‌ పెరుగుతారు అనేది వారి అంచనా.

మరి ముందు ముందు అయినా అల్లు వారి నుండి క్వాలిటీ కంటెంట్‌ వస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube