తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలుసు ఈయన అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ స్వతహాగా గీతా ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించి వరుసగా సినిమాలు చేస్తు ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో ఉంటున్నాడు…
అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ( Chiranjeevi )సంబంధించిన సినిమా విషయాలన్ని అల్లు అరవింద్ చూసుకునేవాడు చిరంజీవి ఏ సినిమా చేయాలి, ఏ విధమైన సినిమా చేస్తే ఆయన కి ఇమేజ్ పరంగా బాగుంటుంది అనేది మొత్తం అరవింద్ చూసుకునేవాడు.ఇక ఈ క్రమంలోనే ఒకరోజు చిరంజీవి విశ్వనాథ్ గారితో సినిమా చేయాలి అని అనుకున్న సమయంలో అల్లు అరవింద్ ఉండి చిరంజీవి గారితో మీతో విశ్వనాథ్( Viswanath ) గారు ఒక సినిమా చేయాలనుకుంటున్నారు అని చెప్పి చిరంజీవి గారిని సినిమాకి ఒప్పించాడు.అలాగే విశ్వనాధ్ గారితో కూడా చిరంజీవి మీతో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు అని చెప్పి వీళ్ళ కాంబో లో సినిమా సెట్ చేసి వీళ్ళ కాంబో లో స్వయంకృషి , ఆపద్భాందవుడు( Aapadbandhavudu ) అనే సినిమాలు చేశారు ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.
అల్లు అరవింద్ ( Allu aravind )విశ్వనాథామృతం అనే ఒక ప్రోగ్రాం లో ఈ మేటర్ చెప్తూ నేను విశ్వనాథ్ గారిని చిరంజీవి గారిని మోసం చేశాను అంటూ నవ్వుకుంటూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.అయితే ఈ ఇద్దరికీ సినిమా చేయాలని మనసులో ఉంది.కానీ ఎవరూ ముందుకు రావట్లేదు దాంతో అరవింద్ ముందు పడి ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేసి మంచి విజయాలు అందుకునేలా చేశాడు.
అందుకే అరవింద్ ని ఇండస్ట్రీలో చాలామంది చాలా తెలివైన ప్రొడ్యూసర్ గా చెప్పుకుంటారు…ఇక ప్రస్తుతం ఆయన చాలా పెద్ద సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు…
.