టీడీపీ తో పొత్తు పై జనసేన లో చిచ్చు ! రంగంలోకి నాగబాబు

వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, వైసీపీ ఎదుర్కోవాలంటే విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయడమే మార్గమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవల ప్రకటించారు.టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండడం తో పవన్ ఆయన ను పరామర్శించి వచ్చిన వెంటనే పొత్తు ప్రకటన చేశారు.

 Alliance With Tdp In Janasena! Nagababu Entered The Field , Tdp, Chandrababu, J-TeluguStop.com

దీనిపై జనసేనలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు.టిడిపితో పొత్తు అనివార్యమని,  జనసైనికులు అంతా తన వ్యూహాన్ని అర్థం చేసుకోవాలని , ఎక్కడా టిడిపిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని,  రెండు పార్టీలు కలిసే పోటీకి వెళ్తాయి అని పవన్ ప్రకటించారు.

అయితే దీనిపై జనసేన లో ఇంకా అసంతృప్తులు కొనసాగుతూనే ఉన్నాయి.సోషల్ మీడియా వేదికగా టిడిపికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Kalyandileep, Naga Babu, Skil Scam, Tdp

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టింగు వైరల్ కావడంతో జనసేన అగ్రనేతలు రంగంలోకి దిగి  అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు అన్నిటిని కలుపుకుని పోటీ చేస్తామని ఎప్పటి నుంచో పవన్ చెబుతూనే వస్తున్నారు.అయితే అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు తరువాత ఈ విషయాన్ని ప్రకటించారు.అంతేకాదు క్షేత్రస్థాయిలో టిడిపి తో కలిసి ముందుకు వెళ్లే విధంగా కేడర్ కు దిశా నిర్దేశం చేశారు.

ఇకపై అన్ని కార్యక్రమాలు రెండు పార్టీలు కలిసి చేపడతాయని ప్రకటించారు.అయితే టిడిపి తో పొత్తు ను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న జనసేన నేతలు సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు.

టిడిపి పై విమర్శలు చేయడంతో పాటు, టిడిపిలో కొంతమంది నేతలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Kalyandileep, Naga Babu, Skil Scam, Tdp

దీనికి టిడిపి నేతలు ప్రతిస్పందిస్తూ, విమర్శలు చేస్తుండడంతో రెండు పార్టీల పొత్తు వ్యవహారం పై తప్పుడు సూచనలు వెళ్తాయని భావించిన , జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తో పాటు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Naga babu ) రంగంలోకి దిగారు.అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు .చాలా కాలంగా జనసేన తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర గత కొద్ది రోజులుగా టిడిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ ఉండడంతో,  నాదెండ్ల మనోహర్, నాగబాబు రంగంలోకి దిగి కళ్యాణ్ దిలీప్ సుంకర కు నచ్చజెప్పి ప్రయత్నం చేయడంతో, ఆయన కాస్త సైలెంట్ అయ్యారు.అయితే ఈ తరహా ఇబ్బందులు ముందు ముందు మరిన్ని ఏర్పడే అవకాశం ఉండడంతో, జనసేన ఈ విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది .ఈ మేరకు పార్టీ కీలక నాయకులు అందరితో సమావేశం నిర్వహించి పొత్తుల వ్యవహారం పై మరోసారి చర్చించి పార్టీ నేతలు ఎవరూ గీత దాటకుండా చూడాలని నిర్ణయించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube