తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్, హీరో అయిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అదేవిధంగా హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లరి నరేష్.ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పటికి దాదాపుగా 20 ఏళ్లు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా తాజాగా అల్లరి నరేష్ పలు విషయాలను పంచుకున్నారు.అల్లరి నరేష్ ఈవీవీ సత్యనారాయణ కొడుకు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
సినిమా హిట్ అయినప్పుడు ఆనంద పడకూడదు, ఫ్లాప్ అయినప్పుడు కుమిలి పోకూడదు అని తెలిపాడు అల్లరినరేష్.
తన కెరిర్ లో వరుస ఫ్లాప్స్ తర్వాత తాను ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని నేచుకున్నాను అని తెలిపారు అల్లరి నరేశ్.
అదేవిధంగా రవిబాబు దర్శకత్వంలో నరేశ్ హీరోగా పరిచయమైన అల్లరి సినిమా విడుదల అయి కూడా నేటితో ఇరవై ఏళ్లు పూర్తి అవుతోంది.నరేష్ తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు దాదాపుగా 57 సినిమాలలో నటించాడట.
గాలి శీనుతో నాకు శంభో శివ శంభో సినిమాలో చేసే అవకాశం వచ్చిందట.అయితే గమ్యం, శంభో శివ శంభో సినిమాలలో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్ నరేష్ ను నమ్మారట.
అలా మహర్షి సినిమాలో నటించే అవకాశం చాన్స్ వచ్చింది అని తెలిపాడు నరేష్.

అయితే మహర్షి సినిమా తర్వాత ఒక ప్రొడ్యూసర్ నరేష్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వెళ్లిపోవచ్చు అని చెప్పారట.అయితే ఆ తర్వాత నాంది సినిమా హిట్ అవ్వడంతో సదరు ప్రొడ్యూసర్ నరేష్ కి ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారట.ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండవచ్చు.
అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు ఎక్కడ ముగిసి పోతుందో ఎవరు నిర్ణయించలేము.ఎవరి కెరిర్ ను ఎవరు డిసైడ్ చేయలేరు అని చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్.
ఇకపోతే నరేష్ ప్రస్తుతం ఇట్లు.మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలో నటిస్తున్నాడట.
ఈ సినిమాతో పాటు మరో మూడు కథలను ఓకే చేశాడట.







