తెలంగాణ కాంగ్రెస్ లో వీరందరికీ పదవులు ! అనుకున్నది సాధిస్తారా ? 

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలోపేతం అయిందని, బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అది తమకు కలిసి వస్తుందనే నమ్మకం పెట్టుకున్నారు.

ఈ మేరకు పార్టీని మరింత పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  ఇటీవలే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరగడం మరి కొంతమంది కీలక నేతలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.ఈ మేరకు పార్టీ నాయకులను ఎన్నికల మూడ్  లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

 టి.పిసిసికి గతంలో చైర్మన్ గా ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్( Madhu Yaskhi Goud ) కు మరోసారి అవకాశం కల్పించారు.అలాగే ఇటీవల పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Redd )కి పిసిసి ప్రచార కమిటీలో కో చైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

దీంతో పాటు టిపిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ,ప్రవీణ్ రెడ్డి ,కత్తి కార్తీక గౌడ్, మహమ్మద్ జావేద్ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్ , జూలూరు ధనలక్ష్మి గౌడ్, జనగాని దివాకర్ గౌడ్,  వరంగల్ రవి, నాగన్న,  అమ్ముగోతు వెంకటేష్, రాములు యాదవ్, దాస్ గౌడ్, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, గిడుగు రోహిత్ బండ శంకర్, కోలా వెంకటేష్, దినేష్ సాగర్ ముదిరాజ్,  గోపాల్ రెడ్డి,  దందెం రామ్ రెడ్డి,  శ్రీకొండ మల్లేష్,  కోటా శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్,  చారులత రాథోడ్,  రేణుక , గిరి నాగభూషణం,  భీమ్ భరత్,  కే శివకుమార్ , సాయిని రవి,  రఘువీర్ గౌడ్,  డాక్టర్ కె విజయ్ కుమార్ , లోకేష్ యాదవ్ , ఏఎం ఖాన్,  జంగారెడ్డి, డాక్టర్ వడ్డేపల్లి రవి, తాడికొండ శ్రీనివాస్ , డాక్టర్ మోతిలాల్  కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు.

ఇక తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు పర్యవేక్షకులను అధిష్టానం నియమించింది.అదిలాబాద్ కు ప్రకాష్ రాథోడ్, భువనగిరికి శ్రీనివాస్ మణి , చేవెళ్ల అల్లం ప్రభు , హైదరాబాద్ ప్రసాద్ అబ్బయ్య, క్రిస్టోఫర్ తిలక్ కరీంనగర్ , ఆరిఫ్ నసీం ఖమ్మం, పరమేశ్వర్ నాయక్ మహబూబ్ బాద్, మోహన్ కుమార మంగళం మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ మెదక్, పీవీ మోహన్ నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ నల్గొండ, సిడి మేయ్యప్పన్ జహీరాబాద్, బీఏం .నాగరాజ నిజామాబాద్ , విజయ్ నాందేవ్ రావ్ పెద్దపల్లి , రూబీ ఆర్ మనోహరన్, సికింద్రాబాద్ రవీంద్ర , ఉత్తమరావు దల్లి వరంగల్ కు నియమించారు.ఈ కొత్త సభ్యుల ద్వారా క్షేత్రస్థాయి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది .ఈ మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలు ఆరాతీస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు