ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అంటే పెద్ద ఎత్తున ఫోటోషూట్స్( Photo Shoots ) నిర్వహించడం ఫ్యాషన్ అయింది.ఒకప్పుడు పెళ్లిలో మాత్రమే ఫోటోలు తీసేవారు.
తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరుపుకునేవారు.అయితే ప్రస్తుతం పెళ్లికాకుండానే ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంటూ వధూవరులు ఇద్దరు కలిసి ఎంతో విభిన్నంగా తమ ఫోటోషూట్ జరుపుకుంటూ ఉన్నారు.
ఇలా చాలామంది ఈ ఫోటో షూట్ ల కోసం కొన్నిసార్లు రిస్క్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము.గత కొద్దిరోజుల క్రితం ఓ జంట ఏకంగా డ్రైనేజీలో ఫోటోషూట్ చేయించుకున్న ఘటన వైరల్ గా మారింది.

ఇక తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి బుల్లితెర నటి విడాకులు వచ్చిన సందర్భంలో ఫోటోషూట్ నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ మధ్యకాలంలో మెటర్నటీ ఫోటోషూట్ కూడా ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే తాజాగా కేరళలోని ఓ జంట ఇలా మెటర్నరీ ఫోటోషూట్ చేయించుకోవడమే కాకుండా గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి యువకుడు డాన్స్ చేసినటువంటి వీడియో సంచలనంగా మారింది.
అయితే ఈ వీడియో పై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) స్పందించారు.

ఈ సందర్భంగా వేణు స్వామి ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ వీడియోని షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన మనం ఇంకా ఎన్నెన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్లు చేశారు.మొన్న బురదలో వెడ్డింగ్ షూట్ నిన్న విడాకుల షూట్, ఈరోజు ఇలా సీమంతపు షూట్.
ఇక మిగిలింది శోభనం షూట్ మాత్రమేనని ఈ సందర్భంగా ఈ వీడియో పై వేణు స్వామి మండిపడుతూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







