కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల ప్రచారం చివరి దశకు చేరుకుంది.ఎన్నికల ప్రచారానికి రేపటితో గడువు ముగియనుండటంతో పార్టీల నేతలు నిమగ్నమైయ్యారు.
ఓ వైపు బీజేపీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.మరోవైపు సోనియాగాంధీ ప్రచారం చేస్తుండగా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.







